calender_icon.png 16 September, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూతగాదాలో మహిళపై దాడి.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

16-09-2025 07:34:31 PM

చివ్వేంల: భూతగాదాలలో ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి గాయపరిచిన సంఘటనలో చివ్వేంల పోలీసులు(Chivvemla Police) కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలంలోని ఎంజీనగర్ తండాలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై మహేశ్వర్ తెలిపిన వివరాలు ప్రకారం.. తండాకు చెందిన రత్నావత్ జానమ్మపై భూ గెట్ల తగాదా విషయంలో ఇదే తండాకు చెందిన రత్నావత్ మహేష్ రత్నావత్ రవి, రత్నావత్ శీను కలసి దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో జానమ్మకు తీవ్ర గాయాలు కాగా బాధితురాలు ఫిర్యాదు మేరకు ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.