16-09-2025 07:26:08 PM
మండల వైద్యాధికారి గుగులోత్ రవి నాయక్.
మరిపెడ (విజయక్రాంతి): మహబూబాద్ జిల్లా మరిపెడ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రవి ఆధ్వర్యంలో 'స్వస్థ నారి-సశక్త్ పరివార్ అభియాన్' అనే కార్యక్రమంపై వైద్య సిబ్బందికి అవగాహన కలిపించారు. ప్రధాని మోదీ పుట్టినరోజున 'స్వస్థ నారి-సశక్త్ పరివార్ అభియాన్' కేంద్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్య పరిరక్షణను మెరుగుపరచడం, మెరుగైన వైద్య సేవల ద్వారా కుటుంబాలను, దేశాన్ని బలవంతం చేయడం అనే దృఢమైన లక్ష్యంతో 'స్వస్థ్ నారీ - సశక్త్ పరివార్ అభియాన్' ను రూపొందించింది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న ఇందౌర్‌లో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అక్టోబరు 2 వరకు దేశ వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించనున్నారు. రేపు మన మరిపెడలో స్థానిక ఏమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచంద్రు నాయక్ ప్రారంభం చేస్తారని తెలిపారు.
డాక్టర్ రవి మాట్లాడుతూ ప్రతి ఆరోగ్య కేంద్రం పరిధిలో అవగాహన సదస్సులు కార్యక్రమంలో భాగంగా ఆయుష్మాన్ మందిరాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, వైద్య శిబిరాలు, అలాగే అవగాహన సదస్సులు నిర్వహించబడి, ప్రజలకు మరింత చేరువగా ఆరోగ్య సేవలు అందజేయబడతాయి. ఆరోగ్య శిబిరాల్లో పొందిన సేవల వివరాలను ఆన్‌లైన్‌లో సమయానుసారంగా నమోదు చేయాలని సూచించారు. వైద్య శిబిరాల్లో ఏర్పాటు చేస్తారు. ప్రసూతి, చిన్న పిల్లలు, కంటి, ఈఎన్టీ, దంత, సైకియాట్రీ, డెర్మటాలజీ రంగాల్లో వైద్య సేవలు అందించబడతాయి. మహిళలకు హిమోగ్లోబిన్ స్థాయి, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, టీబీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. గర్భిణి మహిళలకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, చిన్నారులకు అవసరమైన టీకాలు అందజేస్తారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పౌష్టికాహారం ప్రాధాన్యతను గురించి ప్రజలకు అవగాహన కల్పించబడుతుంది. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ ఎనీమియా పరీక్షలు నిర్వహించి, పరీక్షల ఫలితాల ఆధారంగా కార్డులు జారీ చేస్తారు. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కార్డులు జారీ చేయడం జరుగుతుంది.ఈ కార్యక్రమం లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కమల, పీహెచ్ఎన్ఓ మంగమ్మ, సూపెర్వైసోర్ కృష్ణ, సుదర్శన్, ఆచార్యులు, లక్ష్మి కుమారి, మాధవి, పల్లె దవాఖాన సిబ్బంది సిరి, ఝాన్సీ, సాయిశ్రీ, ఉపేంద్ర, సౌజన్య, తరిణి, తదితరులు పాల్గొన్నారు.