calender_icon.png 11 October, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కేసులు

11-10-2025 12:00:00 AM

హనుమకొండ తహసీల్దార్ రవీందర్ రెడ్డి

హనుమకొండ టౌన్, అక్టోబర్ 10 (విజయక్రాంతి) : ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హనుమకొండ తాసిల్దార్ రవీందర్ రెడ్డి హెచ్చరించారు. వడ్డేపల్లి గ్రామ ప్రజల ఫిర్యా దు మేరకు హనుమకొండ, వడ్డేపల్లి రెవెన్యూ పరిధిలోని బతుకమ్మ బం డ ప్రభుత్వ భూమిని శుక్రవారం సందర్శించారు.

మండల గిరిదావర్ దశరథ రామిరెడ్డి, గ్రామ పరిపాలన అధికారిలు సర్వేయర్‌తో సర్వే చే యించి హద్దులు ఏర్పా టు చేశారు.  ఈ సందర్భంగా తహసీల్దార్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ భూములను అక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎవరిని ఉపేక్షించేది లేదని అన్నారు.