calender_icon.png 21 May, 2025 | 10:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్టుబడి తక్కువ..దిగుబడి ఎక్కువ

21-05-2025 12:00:00 AM

  1. పెరిగిన జొన్న విస్తీర్ణం..

దిగుబడులు ఆశాజనకం...

క్వింటాలుకు రూ.3,371 మద్దతు ధర 

అకాల వర్షాల నేపథ్యంలో త్వరితగతిన కొనుగోలు చేయాలంటున్న రైతులు

ఆదిలాబాద్, మే ౨౦ (విజయక్రాంతి): తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి రావడంతో ఈ యేడు ఆదిలాబాద్ జిల్లాలో రైతు లు జొన్న పంట వైపు మొగ్గుచూపారు. చీడపీడల బెడద లేకపోవడం, తక్కువ నీటి అవ సరం ఉండటంతో ఈ జొన్న పంట విస్తీర్ణం పెరగడానికి ఒక కారణమని చెప్పవచ్చు. ప్రభుత్వం సైతం జొన్న పంటకు మద్దుతు ధరను పెంచి కొనుగోలు చేస్తుండటంతో యాసంగిలో జిల్లాలోని రైతులు జొన్న పంటవైపు ఆసక్తి చూపించారు.

జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం లక్షకు పైగా ఎకరాల్లో జొన్న పంటను రైతులు పండించారు. దాదాపు 14 లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి రావచ్చని అంచనా వేశారు.  ప్రస్తుతం జిల్లా లో ఏ గ్రామీణ ప్రాంతానికి వెళ్లినా రోడ్ల వెం ట ఏపుగా పెరిగిన జొన్నపంట చూపరులకు కనవిందుచేస్తోంది. 

సాధారణంగా ఆదిలాబాద్ జిల్లాలో అధి క విస్తీర్ణంలో సాగయ్యే పంట పత్తి, ఆ తర్వా తి స్థానం సోయా చిక్కుడుది. అయితే ఈ యేడాది సకాలంలో వర్షాలు పడక పత్తి పంట దిగుబడి తగ్గింది. రైతులు ఆశించిన స్థాయిలో మద్దతు ధర  లభించకపోవడంతో నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.

ఈ పరిస్థితుల్లో రైతులు నష్టాల నుండి బయటప డేందుకు తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం వచ్చే పంటల సాగువైపు ఆసక్తిని చూపారు. ఇందులో భాగంగా ఎక్కువ మంది రైతులు జొన్న పంటను సాగు చేశారు. జొన్న పంట ఒక ఎకరానికి కనీసం 15 నుండి 20 క్వింటా ళ్ల వరకు దిగుబడి వచ్చింది. ప్రభుత్వం సైతం జొన్న క్వింటాలుకు రూ. 3,371 మద్దతు ధర చెల్లిస్తుండటంతో రైతులు జొన్న పంట వైపే మొగ్గుచూపారు. 

కొనుగోలు పరిమితి

గత సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 27 వేల 600 మంది రైతులు 71 వేల 300 ఎకరా ల్లో జొన్న పంటను సాగుచేస్తే, ఈ సంవత్సరం ఒక లక్షకు పైగా ఎకరాల్లో జొన్న పంటను వేసినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి, తలమడుగు, జైనథ్, భీంపూర్, బోథ్, ఇచ్చోడ, ఆదిలాబాద్ రూరల్  మండలాల్లో ఎక్కువ సంఖ్యలో రైతులు ఈ జొన్నపంట ను సాగుచేశారు.

ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు సైతం ప్రారంభించింది. అయితే కొనుగోలు పరిమితికి సంబంధించిన ఆంక్ష లు విధించడంతో  రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ మొత్తంలో దిగుబడి వస్తు న్న నేపథ్యంలో ప్రభుత్వం పరిమితిని పెంచి కొనుగోలు చేయాలని కోరుతున్నారు. అకా ల వర్షాలు కురిసి జొన్నలు తడిసే అవకాశం  ఉన్నందున కొనుగోళ్లు త్వరితగతిన చేపట్టాలని కోరుతున్నారు.

ప్రభుత్వ ఆదేశాలతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుతోపాటు ఉట్నూరు, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బోథ్, నేరడిగొండ, బోరజ్, సాత్నాల తదితర ప్రాంతాలలో జొన్న కొనుగోలు కేంద్రా లను అధికారులు ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేపడుతున్నారు. ఏదిఏమైనప్పటికి గత సంవత్సరం కంటే ఈయేడాది జొన్న విస్తీర్ణం పెరగడమే కాకుండా మంచి దిగుబడులు రావడంతో, ప్రభుత్వ మద్దతు ధర సంతృప్తిగా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.