25-10-2025 12:49:26 AM
ప్రభుత్వానికి రూ. 83.58 కోట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి
నిజామాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో మద్యం దుకాణాల కై లక్కీ డ్రా ఈనెల 27 న జిల్లాలో మద్యం దుకాణాలకు లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. 27 న జిల్లాలో మద్యం దుకాణాలకు లక్కీ డ్రా నిజామాబాద్ సిటీ నూతన మద్యం పాలసీ 2025-27కు గాను జిల్లాలో 102 మద్యం షాపులకు 2,786 దరఖాస్తులు వచ్చాయి. టెండర్ల ప్రక్రియ గురువారంతో ముగిసిందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు.
మద్యం దుకాణాల దరఖాస్తుల ద్వారా నిజామాబాద్ జిల్లా నుంచి ప్రభుత్వానికి రూ. 83.58 కోట్లు వచ్చాయన్నారు. నిజామాబాద్ పరిధిలో 36 మద్యం దుకాణాలకు 963 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు. బోధన్‌లో 18 మద్యం దుకాణాలకు 455 దరఖాస్తులు, ఆర్మూర్‌లో 25 మద్యం దుకాణాలకు 618 దరఖాస్తులు వచ్చాయన్నారు. భీమ్‌గల్‌లో 12 మద్యం దుకాణాలకు 369 దరఖాస్తులు వచ్చాయని, మోర్తాడ్ పరిధిలో 11 మద్యం షాపులకు 381 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు.
అత్యధికంగా దరఖాస్తులు వచ్చిన వైన్‌షాపులివే..
ఏర్గట్లలో 94వ నంబర్ మద్యం దుకాణానికి అత్యధికంగా 96 దరఖాస్తులు వచ్చాయి. అలాగే ఆలూర్‌లోని 66వ నంబర్ మద్యం షాప్‌నకు 74 దరఖాస్తులు, వేల్పూర్ మండలంలోని మద్యం దుకాణానికి 69 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. భారతి గార్డెన్స్‌లో ఈనెల 27న ఉదయం 10.30 గంటలకు నగరంలోని భారతీ గార్డెన్స్‌లో మద్యం దుకాణాలకు లక్కీడ్రా నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు.
కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో డ్రా తీయనున్నట్లు తెలిపారు. ఎంపికైన లైసెన్సు దారులు అదే రోజు 1/6 వ వంతు లైసెన్స్ ఫీజును భారతి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన బ్యాంక్ కౌంటర్‌లో డబ్బులు కట్టాల్సి ఉంటుందన్నారు. 27 న ఉదయం 9 గంటలకు తమ హాల్ టికెట్‌తో భారతి గార్డెన్‌కు చేరుకోవాలని అధికారి పేర్కొన్నారు. సెల్‌ఫోన్లు లోపలికి అనుమతించ మని మల్లారెడ్డి తెలిపారు.