25-10-2025 12:48:48 AM
అశ్వాపురం, అక్టోబర్ 24, (విజయక్రాంతి): మల్లెలమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతలు కాకర్ల పూడి రామమూర్తి, బత్తుల నరసింహారావుల వితరణతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను శుక్రవా రం స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు.ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన, ఫలితాలు కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోవు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో నాణ్యమైన విద్యాబోధనతో పాటు క్రీడలు, కంప్యూటర్ విద్య, పోషకాహారం వంటి సదుపాయాలు సమకూరుస్తున్నాం అని తెలిపారు. అంతేకాకుండా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు అందిస్తున్న ఉత్తమ విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించి గ్రామం, తల్లిదండ్రులు, గురువులకు గౌరవం తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వీరస్వామి, పాఠశాల హెచ్‌ఎం గోపి వరప్రసాద్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య, నెల్లిపాక సొసైటీ చైర్మన్ తుక్కాని మధుసూదన్ రెడ్డి, ఓరుగంటి రమేష్ బాబు, బేతం రామకృష్ణ, తూము పెద్దరాఘవులు, కొండ బత్తుల ఉపేందర్, బీసీ సెల్ అధ్యక్షుడు బచ్చు వెంకటరమణ, గ్రామ శాఖ అధ్యక్షుడు బారాజు సంపత్, మచ్చ నరసింహారావు, అవుల రవి, సామకూరి వెంకన్న, సింగం శ్రీధర్, గుర్రం చెన్నయ్య, బండి సిద్దు, వేముల విజయ్, కోల శశికాంత్, రావులపల్లి నరసింహారావు, తెల్లం వీరభద్రం, లంకమల్ల కొండలరావు తదితరులుపాల్గొన్నారు.