calender_icon.png 11 January, 2026 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహా శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

10-01-2026 12:00:00 AM

ఆలయ పాలకమండలి తీర్మానం 

జహీరాబాద్, జనవరి 9 : మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఝరాసంఘం శ్రీ కేతగి సంగమేశ్వర స్వామి ఆలయ పాలక మండలి తీర్మానించింది. శుక్రవారం పాలకమండలి చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్ అధ్యక్షతన పాలకమండలి సమావేశమైంది. ఈ సందర్భంగా పలు తీర్మానాలను ఆమోదించింది. దేవాలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా క్యూ లైన్లను ఏర్పాటు చేయాలని తెలిపారు ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను నడిపేందుకు ఆర్టీసీ వారిని సంప్రదించి పలు సూచనలు సలహాలు ఇవ్వాలని తీర్మానించింది.

ఆలయానికి కొత్త శోభ సంతరించేలా రకరకాల రంగులతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. ఆలయంలో లైటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. జహీరాబాద్ నుంచి వచ్చే రహదారి ఝరాసంగం వద్ద రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున మరమ్మతు చేసేందుకు రోడ్లు భవనాల శాఖ అధికారులను కలిసి చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్వామివారి కల్యాణోత్సవం, రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని ఆయన పాలకమండలి సభ్యులకు విజ్ఞప్తి చేశారు.

స్వామివారిని దర్శించుకునేందుకు వీఐపీ, సాధారణ దర్శనం క్యూలైన్లను నూతనంగా ఏర్పాటు చేస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ నిర్వహణ అధికారి వి శివ రుద్రప్ప, మండల సభ్యులు జి.లక్ష్మయ్య, మల్లన్న శివకుమార్, ఎంపీ నవాజ్ రెడ్డి, శ్రీనివాస్, తిరుమలేష్, మల్లికార్జున్, మలిశెట్టి విట్టల్ రెడ్డి, ఈశ్వరప్ప, బసయ్య స్వామి, మల్లికార్జున్, ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హనుమంతరావు పాటిల్ పాల్గొన్నారు.