23-08-2025 06:21:23 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): పాత పెన్షన్ (ఓపిఎస్) విధానాన్ని తక్షణమే అమలు పరచాలని కోరుతూ తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ (టిఎస్సీపీఎస్ఇయు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా మహబూబాబాద్ మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న అన్ని తరగతులు ఉద్యోగులు శనివారం భోజన విరామ సమయంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. మహబూబాబాద్ మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ లింగాల కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, సిపిఎస్ విధానం, వద్దని నినాదాలతో దిక్కులు పెకటిళ్లే విధంగా నినదించారు.