23-08-2025 06:22:06 PM
కాంగ్రెస్ పార్టీ ఆరు అబద్ధాలు 66 మోసాలు..
బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ రాజేశ్వర్..
మిడ్జిల్: కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో ప్రజలు విసిగిపోయారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ రాజేశ్వర్(BJP District General Secretary Rajeshwar) పేర్కొన్నారు, శనివారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో మోసపోయిన తెలంగాణ ప్రజలకు రైతులకు అండగా ఉంటూ పోరాటం చేస్తామన్నారు, కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 20 నెలలుగా నిర్వహిస్తున్న పాలనను ప్రజల ముందు ఎండగట్టేందుకు బిజెపి ఉద్యమిస్తుంది అన్నారు.
రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని సన్న వడ్లకు 500 రూపాయలు బోనాస్ ఇస్తామని వికలాంగులకు 6000 పింఛన్ పెంపు చేస్తామని ఆటో డ్రైవర్లకు 12000 జీవనభృతి అందిస్తామని 420 గ్యారంటీ ల పేరుతో ఎన్నో మోసపూరితమైన హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనీ మండిపడ్డారు. గత టిఆర్ఎస్ పాలకుల మాదిరిగానే ఇప్పటి కాంగ్రెస్ పాలకులు తెలంగాణ ప్రజలు విశ్వాసం కోల్పోయారన్నారు, అనంతరం కాంగ్రెస్ చేస్తున్న మోసాలపై తహసిల్దార్ పులి రాజుకు వినతి పత్రం అందజేశారు, ఈ కార్యక్రమంలో విజయం జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి, జిల్లా కౌన్సిలర్ మెంబర్ వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి వాసుదేవ్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చిర్ర వెంకటరెడ్డి, మండల నాయకులు అంజి శేఖర్, దామోదర్ రెడ్డి, భీమయ్య, బుచ్చయ్య, హుస్సేన్, బీర్ల శేఖర్ , గణేష్ తదితరులు పాల్గొన్నారు.