calender_icon.png 29 July, 2025 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాకవి దాశరథి శతజయంతి వేడుకలు

22-07-2024 12:00:00 AM

మహాకవి దాశరథి కృష్ణమాచార్య శతజయంతి వేడుకలు నేటి నుంచి ఆరంభమవుతు న్నాయి. ఈ సందర్భంగా ‘తెలంగాణ సాహిత్య అకాడమి’ వెలువరించే త్రైమాస పత్రిక ‘పునాస’ను దాశరథి రచనలపై విశ్లేషణ, దాశరథి ఆత్మీయులతో అనుబంధం మొదలైన అంశాలతో దాశరథి సమగ్ర సాహితీ ప్రత్యేక సంచికను తీసుకు వస్తున్నాం. ఇంకా దాశరథి రచనలు, భావజాలం వంటి పలు అంశాలు విద్యార్థులకు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయం, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, నిజాం కళాశాల, సిటీ కళాశాలల్లో 23 నుంచి 27 వరకు ‘దాశరథి సాహిత్య సమాలోచన’ పేరున సమావేశాలను నిర్వహిస్తున్నాం. 24న దాశరథి సినీ గీతాలతో ‘స్వర నీరాజనం’ రవీంద్రభారతిలో సా.6 గం.లకు ఏర్పాటు చేశాం.

 జూపల్లి కృష్ణారావు 

గౌరవ మంత్రివర్యులు 

ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక 

మరియు పురావస్తు శాఖలు