calender_icon.png 31 January, 2026 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాశరథి

22-07-2024 12:00:00 AM

దాశరథి

నీ కలంతో

‘అగ్నిధార’ వలె

అక్షరాలను ధారవోసి

‘రుద్రవీణ’తో

స్వరాలను సృష్టించి

‘మహాంద్రోదయం’తో

ఉషోదయాన్ని

నీ ఆలోచన లోచనలతో

అమృతాభిషేకం చేసినవ్

కారు చీకట్లతో కమ్ముకున్న

తెలంగాణ ప్రజలను

‘తిమిరంతో సమరం’ చేయించినవ్

‘పునర్నవం’తో

పునర్నిర్మాణం చేసిన

మహాకవి దాశరథి!

 స్రవంతి మహిపాల్

9492305647