calender_icon.png 8 May, 2025 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య విద్యార్థులకు మహర్దశ

08-05-2025 12:00:00 AM

  1. 35 ఎకరాలు,166 కోట్లుతో భవనాల నిర్మాణం
  2. కార్పొరేట్ తరహా హంగులతో కొత్త భవనాలు
  3. నేడు మెడికల్ కళాశాలకు భవనాలకు శంకుస్థాపన
  4. వేడుకలో పాల్గొననున్న అమాత్యులు భట్టి, తుమ్మల, రాజనర్సింహ, పొంగులేటి

భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం మే 7 (విజయ క్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైద్య విద్యకు మహర్దశ పట్టనుంది. ఖమ్మం మెడికల్ కళాశాలకు అత్యాధునిక హంగుల తో కార్పొరేట్ తరహాలో కొత్త భవనాలకు గురువారం అమాత్యులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా భూమి పూజ మహోత్సవం నిర్వహించనున్నారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క  , రెవెన్యూ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానంగా నిర్వహించనున్న మెడికల్ కళాశాల ప్రస్తుతం చాలీచాలని భవనాలలో తరగతులు కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఖమ్మం మెడికల్ కళాశాలకు నూతన భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. రఘునాథపాలెం మండలం బల్లేపల్లి శివారులో 35.03 ఎకరాలలో రూ 166 కోట్ల వ్యయంతో మెడికల్ కళాశాల నూతన భవనాలను మంత్రి తుమ్మ ల మంజూరు చేయించారు. 

భవిష్యత్తు అవసరాల దృష్ట్యా...

ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి అనుసంధానంగా ఉన్న ఖమ్మం మెడికల్ కళాశాల  మెడికల్ కళాశాల నిర్మాణం అద్భుతంగా అత్యాధునికంగా ఉండాలని మంత్రి తుమ్మల సంకల్పం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని వసతులతో మె రుగైన సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు చేశారు.

కార్పొరేట్ వైద్య కళాశాలలను తలదన్నేలా నిర్మాణం చేపట్టేందుకు మంత్రి తు మ్మల కంకణం కట్టుకున్నారు. పనులు శరవేగంగా నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం చే సేలా ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నారు. భవిష్యత్తులో విశ్వవిద్యాలయం ఏ ర్పాటు, ఇతర అవకాశాలకు అనుగుణంగా దీనిని అత్యాధునిక వసతులతో రూపకల్పన చేశారు.

పేద విద్యార్థులకు వరం.... 

మెడికల్ విద్య శ్రీమంతులకు మాత్రమే అవకాశం ఉండేది. కానీ ఖమ్మంలో ప్రభుత్వం ఆసుపత్రికి అనుసంధానంగా ఉ న్న వైద్య కళాశాల ప్రతిభ గల పేద విద్యార్థులకు వరంగా మారింది. అత్యాధునిక సౌక ర్యాలతో అత్యుత్తమ అధ్యాపకులతో కార్పొరేట్ కు దీటుగా నిర్మించేలా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ చూపుతున్నారు.

అభివృద్ధి అనే మంత్రాన్ని మంత్రి పదవితో ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా ఆవిశ్రాంతంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి మంత్రి తుమ్మల కృషి చేస్తున్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కు టుంబాలకు,ఏజెన్సీ గిరిజనులకు వైద్య మ రింత చేరువ చేసేలా చర్యలు చేపడుతున్నారు.