calender_icon.png 9 May, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుకు అందుబాటులో శాస్త్రవేత్తలు

08-05-2025 12:00:00 AM

కేవీకే మల్యాల సమన్వయకర్త డాక్టర్ మాలతి

గూడూరు, మే 7 (విజయక్రాంతి): కృషి విజ్ఞాన కేంద్రం మల్యాల శాస్త్రవేత్తలు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తెలంగాణ రాష్ట్రం  ప్రారంభించబడిన వ్యవసాయ కార్యక్రమం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని కె.వి.కె మల్యాల సమన్వయకర్త డాక్టర్స్ మాలతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల డి హెచ్ ఎస్ ఓ మరి అన్న ఏ డి ఏ మహబూబాబాద్ అజ్మీర శ్రీనివాసరావు అదేవిధంగా శాస్త్రవేత్తలచే ఈ కార్యక్రమం ఘనంగా గూడూరు మండలం రైతు వేదికలో జరిగింది.

బుధవారం మహబూబా బాద్ జిల్లా గూడూరు మండలం వడ్డెర గూడెం గ్రామంలో జరిగిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమానికి కెవికె మల్యాల సమన్వయకర్త మాలతి మాట్లాడుతూ పంట మార్పిడి నీటిని పొదుపుగా వాడటం నాణ్యమైన విత్తనాల ఎంపిక ఇతర విషయాలలో చూసుకొని వ్యవసాయం చేయాలని తెలిపారు. వానకాలం పంటల ప్రణాళిక గురించి తెలపడం జరిగింది డిహెచ్‌ఎస్‌ఓ ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ మరియు కూరగాయల సాగుపై దృష్టి సారించాలని తెలిపారు.

మాట్లాడుతూ రైతులు తమ పేరు , ఫోన్ నెంబర్ తో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు ఐడి రిజిస్ట్రేషన్ చేయించుకోవా లని తెలిపారు అదేవిధంగా రైతుల తప్పకుండా సేంద్రియ ఎరువును వాడి పచ్చి రొట్టె పంటలు సాగు పెంపొందించాలని తెలిపారు అదేవిధంగా శాస్త్రవేత్త క్రాంతి కుమార్ మాట్లాడుతూ రైతులు మట్టి పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలని నాణ్య మైన విత్తన ఎంపిక జీవన ఎరువుల వాడకం మరియు అధిక సాంద్రత ప్రతి సాగుపై అవగాహన కల్పించారు.

శాస్త్రవేత్త రాంబాబు మాట్లాడుతూ మిర్చి సాగు యాజమాన్యం, కూరగాయల పంటలో సాగు యాజమాన్యం అదేవిధంగా వివిధ రంగాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో గూడూరు మండల వ్యవసాయ శాఖi అధికారి అబ్దుల్ మాలిక్ ఉపాధ్యాయులు శ్రీనివాస్ విస్తరణాధికారులు మనోజ్ అలేఖ్య మధు విజయ్ పాల్గొన్నారు.