08-05-2025 12:00:00 AM
టేకులపల్లి, మే 7 (విజయక్రాంతి): సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఇల్లందు బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో కోయగూడెం ఓసీలో మే 20న జరి గే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె వాల్ పోస్టర్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భం గా పిట్ మీటింగ్ బ్రాంచి కార్యదర్శి ఎం డి అబ్బాస్ అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్ర మంలో సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జి ల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబి పాల్గొ ని మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభు త్వం మూడవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టబద్ధత కలిగినటువంటి 29 కార్మి క చట్టాలనురద్దు చేశారని వాటి స్థానే తెచ్చిన చట్టబద్ధతలేని 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని,బొగ్గు పరిశ్రమను ప్రైవేటీకరణ, కాంట్రా క్టీకరణ చేయకూడదాని, కమ ర్షియ ల్ మై నింగ్ రద్దు చేసి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపాలి, తదితర డిమాండ్ల సాధన కోసం సిం గరేణిలోని సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తాళ్లూరి కృష్ణ వరంగంటి రాజమొగిలి, ఆర్ బీ జనార్ధన్ రాజు, ఎం డి అబ్బాస్ సిరాజ్ అహ్మద్, కడుదల వీరన్న, ఈసం నరసింహరావు పాల్గొన్నారు.