13-10-2025 03:39:02 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్‌పి కాంతిలాల్ పాటిల్ ప్రజల నుండి పలు ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధించిన అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌పీ మాట్లాడుతూ... ప్రజల సమస్యలను చట్టపరమైన మార్గాల్లో పరిష్కరించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలు ఎటువంటి భయం లేకుండా, మూడో వ్యక్తి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి, తక్షణ పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఫిర్యాదులు స్వీకరించిన వెంటనే వాటిపై చర్యలు తీసుకుని, బాధితులకు తొందరగా న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.