calender_icon.png 13 October, 2025 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఎస్సీ ఎస్టీ విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

13-10-2025 04:15:15 PM

హనుమకొండ,(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కీం కింద చదువుతున్న విద్యార్థులకు నిధులు విడుదల చేయకుండా ఎస్సీ,ఎస్టీ విద్యార్థులను విద్యకు దూరం చేస్తుందని ఏఐఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా వరంగల్  అధ్యక్షుడు దిడ్డీ పార్థసారథి అన్నారు. జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కీం నిధులను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో   ఏఐఎస్ఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా  అధ్యక్షుడు దిడ్డి పార్థసారథి మాట్లాడుతూ... బెస్ట్ అవైలబుల్ స్కీం నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి.

జిల్లావ్యాప్తంగా ఉన్న 32 విద్యాసంస్థలకు సుమారు 20 కోట్ల పెండింగ్ ఫీజులను ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల, విద్యార్థులను ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఈ పెండింగ్లో ఉన్నటువంటి నిధుల సాకు చూపుతూ విద్యార్థులను గత 25 రోజులుగా పాఠశాలలకు రానివ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులను వెంటనే ప్రభుత్వం విడుదల చేసి,పేద విద్యార్థులను ఆదుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ విద్యార్థులను  విద్యను దూరం చేసే విధంగా చూస్తుందని,ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే బెస్ట్ అవైలబుల్ స్కీం నిధులను విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని కోరారు.లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలను కలుపుకొని ఉద్యమం చేస్తామన్నారు.