calender_icon.png 13 October, 2025 | 7:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై దేశవ్యాప్తంగా రాజకీయ కుట్ర

13-10-2025 04:05:54 PM

వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలంతా ఐక్యం కావాలి

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డా.ఆర్ఎస్ రత్నాకర్         

హనుమకొండ,(విజయక్రాంతి): ఎస్సీ మాలలను నమ్మించి గొంతు కోసిన కాంగ్రెస్ సర్కార్ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యత పై దేశవ్యాప్త చరిత్రలోనే అతి పెద్ద రాజకీయ కుట్ర చేశారని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్.ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. హనుమకొండ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రత్నాకర్ మాట్లాడుతూ... మాలలంటేనే కాంగ్రెస్ అంటేనే మాలలు, అనుకునే మమ్మల్ని, ఎస్సీ వర్గీకరణ పేరుతో గొంతు కోసింది రేవంత్ రెడ్డి సర్కార్, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నారు. కనీసం ఏ విధమైనటువంటి  శాస్త్రీయత లేకుండా 2011 గాలి లెక్కలు పట్టుకుని, అంత వేగంగా ఎస్సీ వర్గీకరణ చేయవలసిన అవసరం ఏం వచ్చిందని ఈ సందర్భంగా ప్రశ్నించారు.

దళితులకు రిజర్వేషన్ పేరుతో పడేసే ఎంగిలి మెతుకుల్లోనేనా వర్గీకరణ పేరుతో వాటాలు, సామాజిక న్యాయం? మిగతా వాటికి అక్కర్లేదా? రేవంత్ రెడ్డి, చంద్రబాబు అనుభవించే ముఖ్యమంత్రి పదవికి సామాజిక న్యాయం అక్కర్లేదా అన్నారు. అసలు ఈ ఎస్సీ వర్గీకరణను మొదటగా పంజాబ్, హర్యానాలో మొట్టమొదటిగా ఈ దేశంలోవర్గీకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేఅని, బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దీన్ని దేశం మొత్తం ప్రస్తుత బిజెపి ప్రభుత్వం చేసిందన్నారు. నిజానికి ఎస్సీ రిజర్వేషన్ వల్ల వందలో నలుగురికే మాత్రమే బెనిఫిట్ జరుగుతోందని, ఈ వందలో నలుగురికి ఇచ్చే ఈ  ఈ ఫలాలను దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 1108 ఎస్సీ కులాలకు ఎలా పంచుతారు అని ప్రశ్నించారు.

అలాగే ఈ నాలుగు సీట్లను తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎలా పంచుతారని, ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని ప్రశ్నించారు.తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు  మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉంటే మాల ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడం, ఘోరం అన్యాయం, చెంచా గిరికి అలవాటు పడ్డ మాల నాయకులు రాజకీయ పార్టీలకు విశ్వాసంగా ఉన్నారే తప్ప జాతి పట్ల విశ్వాసంగా లేరన్న విషయాన్ని  ప్రతి ఒక్కరు గమనించాలన్నారు. రిజర్వేషన్లు బెనిఫిట్ పొందిన మాల ఉద్యోగులు ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ నాడు ఎదుర్కొనటువంటి గడ్డు పరిస్థితిని మాల సామాజిక వర్గం ఈరోజు ఎదుర్కొంటూ ఉందని,పూర్తిగా తెలుగు రాష్ట్రంలో మాల కులం యొక్క ఉనికిని కోల్పోకుండా, శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలన్నారు.