10-04-2025 02:22:59 PM
హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలోని ప్రశాంత్‌నగర్‌లోని రీసైక్లింగ్ యూనిట్(Recycling unit)లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.. ప్రశాంత్ నగర్(Prashant Nagar)లోని రాగి రీసైక్లింగ్ యూనిట్‌లో మంటలు చెలరేగాయని అగ్నిమాపక అధికారులు తెలిపారు. సమాచారం మేరకు సమీపంలోని అగ్నిమాపక కేంద్రాల నుండి మూడు అగ్నిమాపక వాహనాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. షార్ట్ సర్క్యూట్(Short circuit) కారణంగా మంటలు చెలరేగాయని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించడం జరుగుతోంది. ఆర్థిక నష్టాన్ని నిర్ధారించడం జరుగుతోంది. ఈ ప్రమాదంలో కోటి రుపాయల విలువ చేసే కాపర్ తుక్కు అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.