10-04-2025 02:39:21 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): విత్తనోత్పత్తి(Seed Production)పై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Agriculture Minister Tummala Nageswara Rao) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం(Dr. B.R.Ambedkar Telangana State Secretariat)లో గురువారం సమీక్షించారు. నాసిరకం, కల్తీ విత్తనాల దృష్ట్యా నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి చేయడంపై చర్చించారు. క్షేత్రస్థాయిలో రైతుల పాలాల్లో విత్తనోత్పత్తి విజయవంతంగా నిర్వహించడంపై తుమ్మల పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి సంచాలకులు బీ.గోపి, జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య పాల్గొన్నారు.