15-12-2025 06:33:14 PM
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు..
సుల్తానాబాద్ (విజయక్రాంతి): అభివృద్ధి.. సంక్షేమం కోసం ఈ నెల 17న మూడవ విడతలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. సోమవారం సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల, కనుకుల, తోగర్రాయి కదంబాపూర్ గ్రామాల్లో అలాగే ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటితో గెలిపించాలని ప్రజలను ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.