15-12-2025 07:52:27 PM
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామంలో కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థి సిర్గాపూరం వేద ప్రియా హన్మంతు ప్రచారంలో పాల్గొని కత్తెర గుర్తుకి ఓటేసి గెలిపించాలన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ప్రజాసంక్షేమం సాధ్యమని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వేద ప్రియా కత్తెర గుర్తుకు ఓటేసి యువ నాయకురాలని గెలుపించి సత్తా చాటాలన్నారు. ఇందులో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.