15-12-2025 06:47:24 PM
బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): రాజంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మడవి శ్రీనివాస్‌ను ఫుట్‌బాల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ కోరారు. గత మూడు దశాబ్దాలుగా ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు మడావి శ్రీనివాస్ అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజంపేట గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ అభ్యర్థి మడవి శ్రీనివాస్‌తో కలిసి ఆయన పర్యటిస్తూ ఫుట్‌బాల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఆవిడపు ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ, స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి, ప్రజల మనిషి మడవి శ్రీనివాస్ అని తెలిపారు. ఆయనను గెలిపిస్తే రాజంపేట గ్రామ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. సర్పంచ్ అభ్యర్థి మడావి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజంపేట ప్రజలు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రజల ఆశీర్వాదంతో గెలిస్తే అహర్నిశలు గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గెలిచిన వెంటనే స్మశానవాటిక పనులను పూర్తి చేయడం, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, అసంపూర్ణంగా ఉన్న రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.