calender_icon.png 10 September, 2025 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయండి

09-09-2025 10:28:52 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడానికి సిపిఐ నేతలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ సందర్భంగా పోలీసులకు సిపిఐ నేతలకు తోపులాట జరిగి, సిపిఐ నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ, రైతులు పంటలు వేసుకొని నెలలు దాటినా యూరియా పొలాల్లో యూరియా చల్ల పోతే పంటలు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉందని, యూరియా అందక  రైతులు ఇబ్బంది పడుతుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేంద్ర మంత్రులు,ఎంపీలు నిమ్మకు నీరెతన్నట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంపై నిందలేస్తూ కాలం వెల్లదిస్తున్నారని మోడీ ప్రభుత్వానికి రైతులంటే చులకన అయిపోయిందని ఢిల్లీ నగరంలో సంవత్సరం పాటు రైతన్నలు  రోడ్డెక్కి నిరసనలు తెలిపి తర్వాత  రైతులకు ఇచ్చిన హామీలు నేటికీ నెరవేర్చలేదని శ్రీనివాస్ ఆరోపించారు.ముట్టడి కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గూడెం లక్ష్మీ, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కాంతాల శ్రీనివాస్ రెడ్డి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మచ్చ రమేష్,బావండ్ల పెల్లి యుగేందర్,బీర్ల పద్మ, కొట్టే అంజలి,రామారాపు వెంకటేష్ ,రైతు సంఘం జిల్లా నాయకులు  గోలి బాపురెడ్డి,కోమటిరెడ్డి జయపాల్ రెడ్డి, నాయకులు కేశబోయిన  రాము,మామిడిపల్లి హేమంత్ కుమార్,మల్లేష్,రాజయ్య తదితరులు పాల్గొన్నారు.