09-09-2025 10:10:23 PM
గుండాల (విజయక్రాంతి): యాదాద్రి జిల్లా గుండాల మండలంలోని ఉన్నత పాఠశాలలో రొటరీ క్లబ్ అఫ్ భువనగిరి సెంట్రల్, మెంబర్షిప్ ఎక్సటెన్షన్ తెలంగాణ, కేపాల్ బోన్ సెట్టింగ్ సెంటర్ ఔషాపూర్ డా.ఎంపల్లి బుచ్చిరెడ్డి విద్యార్థులకు సైకిళ్లు, పాఠశాలకు కంప్యూటర్ పంపిణీ చేశారు. అడ్వకేట్ రహీం మాట్లాడుతూ, పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రథమ, ద్వితీయ, తృతీయ విద్యార్థులకు నగదు బహుమతి ఇస్తానని అన్నారు. సుమన్త్ రెడ్డి పాఠశాలలోని విద్యార్థులకి కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గడ్డం జ్ఞాన ప్రకాష్రెడ్డి, కొండల్రెడ్డి, కూచిపట్ల సత్యనారాయణ రెడ్డి ప్రధానోపాధ్యాయులు గంధం చంద్రకళ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.