09-09-2025 10:07:02 PM
మందమర్రి (విజయక్రాంతి): ప్రముఖ కవి కాళోజీ నారాయణ రావు జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఎన్ రాజేశ్వర్(MPDO Rajeshwar) కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ఊపిరిగా జీవించిన ప్రజాకవి అని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీఓ రజియా సుల్తానా, ఐకెపి ఎపిఎం రామచందర్, మండల కాంగ్రెస్ నాయకులు ఒడ్నాల కొమురయ్య, కార్యాలయం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.