calender_icon.png 10 September, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎగ్జిక్యూటివ్ పిటిషన్ లు త్వరగా పూర్తి చేయాలి

09-09-2025 10:17:49 PM

జిల్లా జడ్జి యం.ఆర్. సునీత..

వనపర్తి (విజయక్రాంతి): జిల్లాలో భూసేకరణకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ పిటిషన్ లు త్వరగా పూర్తి చేయాలని జిల్లా జడ్జి యం.ఆర్. సునీత జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh ​​Surabhi)ను సూచించారు. ప్రమాదవశాత్తు కాలి గాయంతో బాధపడుతూ విధులు నిర్వహిస్తున్న జిల్లా జడ్జి యం.ఆర్. సునీతను మంగళవారం జిల్లా కలెక్టర్ కోర్టులో పరామర్శించారు. అదేవిధంగా భూసేకరణ రైతులకు సంబంధించి చాలాకాలం నుండి పెండింగ్ లో ఉన్న 587 ఇ.పి లకు గాను  280 ఇ.పి. లకు సంబంధించిన  చెక్కును జిల్లా జడ్జికి అందజేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ, ఇటీవల ఆర్డీఓ సుబ్రమణ్యం వచ్చిన తర్వాత ఈ.పి కేసులు, ఇతరత్రా భూ సమస్యలు త్వరగా కొలిక్కి వస్తున్నాయని ఆర్డీఓను అభినందించారు. మిగిలిన ఈ.పి లు సైతం త్వరగా పూర్తి చేయాలని సూచించారు.