09-09-2025 10:14:50 PM
మందమర్రి (విజయక్రాంతి): ప్రజా కవి కాళోజీ 111వ జయంతి ఉత్సవాన్ని(తెలంగాణ తెలుగు భాష దినోత్సవం) పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కాళోజీ జయంతి వేడుకల్లో మున్సిపల్ కమిషనర్ టి రాజలింగు(Municipal Commissioner Rajalingu) కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ యాసలో సామాజిక రచనలు చేసి ప్రజలను చైతన్యపరిచి, సామాజికంగా మేల్కొల్పిన గొప్ప ప్రజాకవి కాళోజి అని ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం పద్మ విభూషణ్ బిరుదుతో గౌరవించిందనీ అన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం సుమతి, మేనేజర్ టి రాజేశ్వరి, రెవిన్యూ ఆఫీసర్ పి కృష్ణ ప్రసాద్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎం తిరుపతమ్మ, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్లు ఏం మనోజ్ కుమార్, బుఖ్య రాజ్ కుమార్, ఏ సాయి నిఖిల్, సీనియర్ అసిస్టెంట్ ఏ రాణి, జూనియర్ అసిస్టెంట్లు ఈ వసంత్, ఎస్ పూర్ణచందర్, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ బి శ్యాంబాబు, సిస్టం మేనేజర్ ఏ శిరీష్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఏం గోపికృష్ణ లు పాల్గొన్నారు.