09-09-2025 10:03:27 PM
ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియా డిజియం(ఇ అండ్ యం)గా విధులు నిర్వహించి కొత్తగూడెం ఏరియాకు బదిలీ అయిన జే.క్రిస్టఫర్ ని మంగళవారం జి.యం కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జి.యం. వి.కృష్ణయ్య(G.M. Krishnaiah) మాట్లాడుతూ.. ఇల్లందు ఏరియా ఉత్పత్తి, ఉత్పాదకతలో కీలక పాత్ర పోషించారని, వార్షిక లక్ష్య సాధనలో తన వంతు కృషి చేశారని, అలాగే కొత్తగూడెం ఏరియాలో రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించి మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా సేఫ్టీ అధికారి జాకీర్ హుస్సేన్, పి.ఓ కే.ఓ.సి. గోవింద రావు, జే.కే ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎ.కృష్ణ మోహన్ రావు, డీజియం (సివిల్) రవికుమార్, డీజియం (ఫైనాన్స్) మధుబాబు, డీజియం (ఏరియా వర్క షాప్) నాగరాజు నాయక్, కే.రాందాస్, యస్.దిలీప్ కుమార్, పుల్లి పుర్ణచందర్, బి.శ్యాం ప్రసాద్, మహేశ్వర్, డాక్టర్ కే. శారద దేవి, చిన్నయ్య , నాగేశ్వర్ రావు, ఇతర ఉన్నత అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.