09-09-2025 10:30:28 PM
మంగపేట (విజయక్రాంతి): మండలంలోని కమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టిఎస్ యు టిఎఫ్ మంగపేట అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాళోజి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ, అంబేద్కర్ సెంటర్ లో పాఠశాల విద్యార్థులచే బోనాలు, బతుకమ్మలు, పీరిలు, పాస్టర్ వేశాధారణతో గుత్తి కోయ, లంబాడి నృత్యాలతో ప్రజలను అలరించారు. ఈ కార్యక్రమంలో టిఎస్ యు టిఎఫ్ మంగపేట అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ రాజు ఏఏపిసి చైర్మన్ అనిత విఓ అధ్యక్షులు పార్వతి నళిని ఏంఅర్సి శ్రీధర్ రేగుల గూడెం పీఎస్ హెచ్ఏం ప్రేమ్ కుమార్ ఉపాధ్యాయులు ప్రసాద్ సునీత నాగలక్ష్మి నాగమణి రమేష్, మౌలాలి నరేష్ నర్సింహారావు వేణుమాధవ్ రెడ్డి రాజేశ్వర్ రావు విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు.