05-05-2025 12:29:37 AM
గూడూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, అంబేద్కర్ కమిటీ చైర్మన్ కత్తి స్వామి
గూడూరు మే 4: (విజయక్రాంతి) ఈనెల పదో తేదీన గూడూరు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం విజయవంతం చేయాలని గూడూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంబేద్కర్ కమిటీ చైర్మన్ కత్తి స్వామి పిలుపునిచ్చారు.
ఆదివారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు కుల సంఘాలు ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో అంబేద్కర్ కమిటీ చైర్మన్ కత్తి స్వామి మాట్లాడుతూ గూడూరు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారి వేం నరేందర్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ఎంపీ బలరాం నాయక్ మానుకోట ఎమ్మెల్యే మురళి నాయక్ ఎమ్మెల్సీ శ్రీ పాల్ రెడ్డి బెల్లయ్య నాయక్ అతిరథ మహారధులు హాజరవుతున్నందున పెద్ద ఎత్తున గూడూరు మండల కేంద్రంలోని ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు పింగిలి శ్రీనివాస్ నునావత్ రమేష్ నాయక్ సింగుడాల వీరస్వామి నూకల ఉపేందర్ లాకావత్ రామచంద్రనాయక్ గోపీనాథ్ హరీష్ శివ రామయ్య తదితరులు పాల్గొన్నారు