calender_icon.png 6 May, 2025 | 9:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భావితరాలకు మహనీయుల చరిత్రను అందించాలి

05-05-2025 12:29:31 AM

కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

కుమ్రం భీం ఆసిఫాబాద్,మే 4(విజయ క్రాంతి): భారతీయ పౌరాణిక చరిత్రలో ప్రసిద్ధి చెందిన రాజులలో భగీరథ మహర్షి ఒకరని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నా రు. ఆదివారం భగీరథ మహర్షి జయంతి సందర్భంగా  కలెక్టరేట్ లో  వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వ-ర్యం లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి సజీ-వన్, వెనుకబడిన తరగతుల సంఘాల నాయకులతో కలిసి హాజరై భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భగీరథ మహర్షి గంగానదిని భూమికి తీసుకురావడంలో సంవత్సరాల పాటు తపస్సు చేసి తీసుకు-వచ్చారని చరిత్ర పేర్కొంటుందని తెలిపారు. మహనీయుల చరిత్రను, భారతదేశ విశిష్టతను భావిత-రాలకు అందించే విధంగా ప్రభుత్వం జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిం-చడం సంతో షంగా ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు అలిబిన్ అహ్మద్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూపు నార్ రమేష్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.