06-05-2025 01:41:12 AM
సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికిన పర్యాటక శాఖ
రాజేంద్రనగర్, మే 5: మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన కంటెస్టెంట్స్ హైదరాబాద్ చేరుకుంటున్నారు. సోమవారం పోర్చుగల్, ఘనా, ఐర్లాండ్ దేశాలకు చెందిన ప్రతినిధులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునున్నారు. వీరికి పూర్తి సంప్రదాయ లాంఛనాలతో స్వాగతం పలికేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది.
స్వాగత సత్కారాలతో పాటు, భద్రత, వసతికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. పోర్చుగల్‌కు చెందిన మారియా అమెలియా ఆంటోనియో, ఘనా నుంచి జుట్టా అమా పోకుహా అడ్డో, ఐర్లాండ్‌కు చెందిన జాస్మిన్ జెర్హార్డ్ హైదరాబాద్ చేరుకున్నారు.
ఇప్పటికే, మిస్ సౌత్ ఆఫ్రికా జోయలైజ్ జన్సెన్ వాన్ రెన్స్ బర్గ్, మిస్ బ్రెజిల్ జెస్సికా స్కేన్ద్రియుజ్య్ పెడ్రోసో, మిస్ వరల్డ్ సీఈవో, చైర్‌పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి, మిస్ కెనడా ఎమ్మా డయానా క్యాథరీన్ మొర్రిసన్ చేరుకున్నారు.
అత్యధిక కంటెస్టెంట్లు 7వ తేదీ నుంచి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఈనెల 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే ప్రారంభ కార్యక్రమంపై మిస్ వరల్ చైర్‌పర్సన్ జూలియా మోర్లీ, ప్రభుత్వ అధికారు లతో సమీక్ష నిర్వహిస్తారు.