calender_icon.png 6 May, 2025 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందువులను గెంటేయండి!

06-05-2025 12:29:11 AM

  1. కెనడాలో ఖలిస్థానీల డిమాండ్ 
  2. టొరొంటో గురుద్వారా ఎదుట భారీ ప్రదర్శన
  3. హిందువులకు వ్యతిరేకంగా నినాదాలు

ఒట్టవా, మే 5: కెనడాలో ఖలిస్థానీలు మరోసారి రెచ్చిపోయారు. దేశ వ్యాప్తంగా ఉంటున్న 8 లక్షల మంది హిందువులను వెంటనే గెంటేయాలని టొరొంటోలోని మాల్టన్ గురుద్వారా ఎదుట వేలాది మంది ప్రదర్శన నిర్వహించారు. అంతేకాదు.. భారత ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ చిత్రపటా లను బోనులో బంధించినట్లు వాహనంలో ఉంచి ప్రదర్శన నిర్వహించారు.

హిందువుల కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖలీస్థానీల చర్యలను అక్కడి హిందువు లు ఖండిస్తున్నారు. మరోవైపు హిం దూ సమాజానికి చెందిన నేత షాన్ బిండా స్పందిస్తూ.. ఖలీస్థానీల ప్రదర్శన భారత్‌కు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళన కాదని, కేవలం హిందూ వ్యతిరేక భావజాలంతోనే ప్రదర్శన నిర్వహించారని మండిపడ్డారు.

కెనడియన్ జర్నలి స్ట్ డానియల్ బోర్డమన్ ఖలీస్థానీల నిరసనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ.. కెనడా ప్రభుత్వం ఖలీస్థానీలపై కఠిన చర్యలు తీసుకోవడం లేద ని రాసుకొచ్చారు. ఆ విషయంలో గత ప్రధాని ట్రూడో, కొత్త ప్రధాని మార్క్ కార్నీకి ఏమైనా తేడా ఉందా..? అం టూ ప్రశ్నిస్తూ పోస్ట్ పెట్టారు.

ఖలీస్థానీలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ డం ఇదేం మొదటిసారి కాదు.. వీరు ఇటీవల భారత  రైల్వేసహాయ మంత్రి రవనీత్‌సింగ్ బిట్టూ హతమార్చేందుకు పథకం పన్నారనే ఆరోపణలు బయటకు వచ్చాయి. ఈ విషయంపై సదరు మంత్రి సైతం ఆందోళన వ్యక్తం చేశారు.