calender_icon.png 29 October, 2025 | 10:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిమ్స్ సన్‌షైన్‌లో ఏఐ టెక్నాలజీ సేవలు

29-10-2025 01:35:19 AM

రోగులకు హాస్పిటల్‌లో స్మార్ట్ వార్డు

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 28 (విజయక్రాంతి): కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ బేగంపేటలో డోజీ గ్లోబల్ ఏఐ ఆధారిత రిమోట్ పేషెంట్ మానిటరింగ్ (ఆర్పిఎం), ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (ఈడబ్ల్యూస్)లో అగ్రగామి సంస్థతో కలిసి స్మార్ట్ వార్డ్స్ పేరుతో మెరుగైన రోగి భద్రతా ప్రమాణాలను మెరుగుపరుస్తూ ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ ఏఐ టెక్నాలజీ హాస్పిటల్ వైద్యసేవల్లో విప్లవాత్మక ముందడుగుగా మారుతోంది.

ఐసి యూలలో ఏ విధంగా 24 గంటలు రోగి ఆరోగ్య పర్యవేక్షణ ఉంటుందో అలాగే ఏఐ ఆధారిత సంరక్షణతో నూతన స్మార్ట్‌వార్డు కార్యక్రమాన్ని కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్‌లో అందుబాటులోకి తీసుకువచ్చినట్టు సీఓఓ సుధాకర్ జాదవ్ తెలిపారు. ప్రతి రోగి ఏ వార్డులో ఉన్నా ఐసియు స్థాయి పర్యవేక్షణ పొందేలా సురక్షితమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటుచేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.

మీడియా సమా వేశంలో కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ సుధేష్ పాటిల్ మాట్లాడుతూ.. ఐసియులో ఏ విధంగా రోగుల ఆరోగ్య పర్యవేక్ష ణ ఉంటుందో అలాగే ఎంపిక చేసిన వార్డులలో డోజీ గ్లోబల్ ఏఐ టెక్నాలజీతో రూపొందించిన కాంటాకట్స్ ఆర్పిఎం, ఈడ బ్ల్యూ టెక్నాలజీని రోగి బెడ్ కింద  సన్నని సెన్సార్ అమర్చడం ద్వారా రోగి హార్ట్‌బీట్, శ్వాస, బీపీ, ఆక్సిజన్ లెవల్స్, ఊష్ణోగ్రతను నిరంతరం ట్రాక్ చేస్తుంది.

పరిస్థితి క్షీణించే ముందు ముందస్తు హెచ్చరికలు పంపుతుంది. ఈ రియల్ టైం పర్యవేక్షణతో రోగి పరిస్థితి విషమించకముందే డాక్టర్లు తగిన వైద్యసేవలు అందించేందుకు వీలవుతుంది” అని తెలిపారు. డోజీ సీనియర్ డైరెక్టర్ కౌశల్ పాండ్యా మాట్లాడుతూ.. ఎఐ టెక్నాలజీని వైద్య సేవలలో సమగ్రంగా అను సందానం చేయడం ద్వారా రోగికి స్థిరమైన వైద్యసేవలను అందించేందుకు అవకాశముంటుందన్నారు. ఈ టెక్నాలజీ స్మార్ట్ హెల్త్ కేర్ మౌళిక సదుపాయాల్లో గ్లోబల్ లీడర్‌గా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో వీడియో, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.