13-11-2025 06:32:53 PM
నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర డీజీపీ డా. శివధర్ రెడ్డి చేతుల మీదుగా పోలీస్ శాఖ పిఆర్ఓలు గురువారం ప్రశంసా పత్రాలు అందుకున్నారు. హైదరాబాదులో పోలీస్ శాఖ పిఆర్ఓ లకు వృత్తి నైపుణ్యత స్థాయి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించగా నిర్మల్ జిల్లాకు చెందిన నిర్మల్ జిల్లా ఎస్పీ పీఆర్వో నరిమెట్ల వంశీ, సోషల్ మీడియా ఇన్‌చార్జి రామ్ పవన్ కుమార్ తమదైన ప్రతిభను చాటుకొని డిజిపి శివధర్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రశంస పత్రాలు స్వీకరించినట్లు తెలిపారు. మూడు రోజులపాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అనేక మేలుకోలను నేర్చుకోవడం జరిగిందని ఇటువంటి శిక్షణలు తమకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి వారు తెలిపారు. ప్రశంస పత్రాలు అందుకున్న పిఆర్ఓ లను జిల్లా ఎస్పీ జానకి షర్మిల జిల్లా పోలీస్ శాఖ అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.