25-08-2025 12:38:42 AM
చిన్న చింతకుంట ఆగస్టు 24 : మదనపురం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బొడ్డు వెంకటన్న భార్య పద్మ గుండె సంబంధిత వైద్యం కొరకు నిమ్స్ ఆస్పత్రికి సీఎం సహాయ నిధి ద్వారా 2 లక్షల ఎల్‌ఓసి చెక్ ను వారి కుటుంబ సభ్యులకు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి అందచేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి, కురుమూర్తి దేవస్థాన మాజీ చైర్మన్, మదనపురం మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్తపల్లి శ్రీనివాస రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.