15-05-2025 12:00:00 AM
బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర సదస్సు పిలుపు
ముషీరాబాద్, మే14 (విజయక్రాంతి): మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ బాగలిం గంపల్లి ఓంకార్ భవనం లో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు బీఎల్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్ది రాములు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా బిఎల్ టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెం కట్ మాట్లాడుతూ భారత బహుజన కార్మిక వర్గానికి రాజ్యాంగం కల్పించిన 44 రక్షణ చట్టాలను రద్దు చేసి కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్ ల ను తెచ్చిన బిజెపి కేంద్ర ప్రభుత్వం అంబానీ, ఆదాని లాంటి స్వదేశీ, విదేశీ కార్పోరేట్ కంపెనీలకు లాభాల కోసం తెచ్చి న కార్మిక వ్యతిరేక 4 కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మే 20న జరిగే దేశ వ్యాప్త సమ్మెలో భారత బహుజన కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లోని ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ఆలోపు సుప్రీం కోర్టు తీర్పుననుసరించి కనీస వేతనం రూ 26 అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు అనీల్ కుమార్, కేహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కే.చంద్రశేఖర్ ప్రసాద్, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు డీ. రాజేష్, ఏఐఎఫ్‌టీ యూ, రాష్ట్ర నాయకులు మల్లేష్, యాకయ్య, టీఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి యస్.
ఖాలీల్, రాష్ట్ర ఉపా ద్యక్షు లు యదగిరి, టీయస్ కేపియస్ రాష్ట్ర అధ్యక్షుడు మైలారం జంగయ్య, రాష్ట్ర నాయకులు గ్యార సాల య్య, యస్. ప్రభాకర్, కేహెచ్‌పీయస్, రాష్ట్ర నాయకుడు యం.వెంకటయ్య, టీవీవీయూ తెలంగాణ వ్యవసాయ వృత్తి దారుల సంఘం రాష్ట్ర అద్యక్షులు డోలక్ యాదగిరి, పీవీకేవీ రాష్ట్ర నాయకుడు శేక్ శావాలి, ఐఎఫ్టీయు జాతీయ నాయకులు, సునీత, ప్రగతీ శీల మహిళల సంఘం రాష్ట్ర నాయకురాలు మేకల రాజేందర్, గంగా శంకర్, బహుజన మున్సిపల్ యూనియన్ రాష్ట్ర నాయకులు బీ. జగదీష్, యస్‌డీ సయ్యద్, తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక రాష్ట్ర నాయకులు, కళాకారులు పాటల ద్వారా ఉత్తేజ పరిచారు.