calender_icon.png 30 July, 2025 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలేజ్ పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

14-05-2025 10:44:01 PM

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సంవర్దవంతమైన సేవలు అందజేస్తు సత్వర న్యాయం జరిగేలా గ్రామ పోలీసు అధికారులు పని చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్(District SP Sharat Chandra Pawar) అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి బుధవారం పోలీసు అధికారులతో నిర్వహించిన జూమ్ మీటింగ్ సమావేశంలో మాట్లాడుతూ... గ్రామ పోలీసు అధికారులు ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రతి రోజు వారికి కేటాయించిన గ్రామాలను సందర్శించి ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యల పట్ల పై అధికారులకు తెలియజేస్తూ సత్వర పరిష్కార దిశగా కృషి చేయాలనీ అన్నారు.

ప్రజలకు, పోలీసులకు మధ్య సత్సంబంధాలు ఏర్పాటు ద్వారా నేర నియంత్రణ సాధ్యం అవుతుందని తెలిపారు. ఇందుకుగాను గ్రామాల్లోకి కొత్తగా వచ్చే అనుమానుమనితుల యొక్క సమాచారం ఎప్పటికప్పుడు గ్రామ ప్రజలతో సంచారాన్ని సేకరించాలని అప్పుడే గ్రామాల్లో జరిగే నేరాలు నిరోధించడానికి ఉపయోగపడతాయని అన్నారు. జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందిస్తూ ప్రజలతో మమేకం అవుతు ప్రజలకు సైబర్ నేరాలు, అక్రమ బెట్టింగ్, గేమింగ్ యాప్స్, కలుగు అనర్ధాలపై గ్రామాలలో దొంగతనాలు, జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించడం, రోడ్డు ప్రమాదాలు, యువత చెడు వ్యసనాలు డ్రగ్స్ కి అలవాటు పడకుండా వాటి ద్వారా జరిగే అనర్థాలపై అవగాహన, నేర నియంత్రణ, ఇతర అంశాల మీద అవగాహన కల్పించినందుకు గాను జిల్లా పోలీసు కార్యాలయంలో ఏడుగురు గ్రామ పోలీస్ అధికారులను అభినందించి రివార్డ్ అందజేశారు.