14-05-2025 10:48:08 PM
సీఐ రాజు వర్మ...
చర్ల (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఐశ్వర్య మహిళా శక్తి గ్రూప్ ఆధ్వర్యంలో చర్ల గ్రామ పంచాయతీ కాంప్లెక్స్ నందు మహిళలచే నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ ఆర్ స్వీట్స్ అండ్ బేకరీనీ బుధవారం సిఐ రాజు వర్మ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆర్థికంగా ఎదగాలని, ఆర్థిక వ్యవస్థకు మహిళలు మూల స్తంభాలాంటి వారని, మహిళలు గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే, వ్యాపారాలు, ఉద్యోగాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. మహిళలందరూ ఎంతో సంకల్పంతో ఏర్పాటు చేసుకున్న ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలన్నారు. ఏజెన్సీలోని మహిళలు వ్యాపార రంగంలో కృషి చేయడం కోసం ఐశ్వర్య మహిళా శక్తి గ్రూపు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవులు, తదితరులు పాల్గొన్నారు.