04-07-2025 10:02:36 PM
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి పట్టణంలో ఉన్న ఆదర్శ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న ఐదుగురు విద్యార్థినిలు త్రిబుల్ ఐటీకి ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్, గాంధీ తెలిపారు. ఎంపికైన విద్యార్థులు పావని అక్షర పింకీ బాయ్ మానస అంజలి, లు త్రిబుల్ ఐటీ ఎంపికైనట్లు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ గాంధీ వెల్లడించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు విద్యను శ్రద్ధతో అభ్యసించి ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని అన్నారు.