04-07-2025 10:15:05 PM
అభ్యుదయ ఆర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో నాటకం ప్రారంభించిన అదనపు కలెక్టర్ విక్టర్
కామారెడ్డి,(విజయక్రాంతి): బుద్ధుడితో నా ప్రయాణం అనే నాటకం అభ్యుదయ అకాడమీ ఆధ్వర్యంలో తేలుగులో నాటకం శుక్రవారం సాయంత్రం కళాభారతిలో నిర్వహించారు. కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ బుద్ధుని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలవేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నాటకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ..బుద్ధుడు శాంతికి ప్రత్యేకమని, బుద్ధుని ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు నడవాలని మత్తుపదార్థాలు, చెడు వాడవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా బుద్ధుని అనుసరించారు అని అన్నారు. ఇలాంటి నాటకం మన కామారెడ్డి లో నిర్వహించడం చాలా గర్వకారణం అని అన్నారు.