11-08-2025 12:46:20 AM
సీపీఎం కేంద్ర నాయకులు బి వెంకట్
నిజామాబాద్ ఆగస్టు 10 (విజయ క్రాంతి): ప్రజా సంపాదనను సహజ వనరులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ దేశంలో పేదరికం నిరుద్యోగం పెరిగే విధంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈనెల 13న దేశవ్యాప్తంగా అన్ని వర్గాల తలపెట్టిన క్విట్ కార్పోరేట్ నిరసన అంతం చేయాలని బి వెంకట్ పిలుపునిచ్చారు.
సిపిఎం అఖిలభారత నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి వెంకట్ ఆదివారం సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రధానంగా అమెరికా సామ్రాజ్యవాదం విధిస్తున్న అదనపు సుంకాల మూలంగా దేశీయ ఉత్పత్తులు దెబ్బతిని నిరుద్యోగం పెరగటానికి కారణమవుతుందని , ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటులో అమెరికన్ ట్రంపు వ్యాఖ్యలను ఖండించాలని అమెరికా వేసిన పనులకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని ఆయన అన్నారు.
లేనియెడల కార్పొరేట్ కంపెనీలను ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్, జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, కార్యదర్శివర్గ సభ్యులు నూర్జహాన్ నగర నాయకులు కటారి రాములు పాల్గొన్నారు.
అనంతరం నాగారంలో జరిగిన విజయదుర్గ సంస్మరణ సభలో బి వెంకట్, బుర్రి ప్రసాద్, ఏ రమేష్ బాబు, వెంకట్ రాములు, వెంకటేష్ తదితరులతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది..