13-08-2025 01:35:32 AM
హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): వాతావరణశాఖ భారీ వర్ష సూచన మేరకు బుధ, గురువారాల్లో హనుమకొండ, జనగామ, మహబాబూబాద్, వరంగల్, యాదాద్రి భువ నగిరి జిల్లాల్లోని అన్ని ప్రైవేటు, ప్రభు త్వ పాఠశాలలు మూసివేయాలని మంగళవారం రాత్రి రాష్ట్ర విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్ప ష్టం చేసింది.
జీహెచ్‌ఎంసీలో ఒక్కపూట బడులు
వాతావరణశాఖ భారీ వర్ష సూచ న మేరకు బుధ, గురువారాల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని అన్ని పాఠశాలల్లో యజమాన్యాలు ఒక్కపూట తరగతులు నిర్వహించాలని మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జా రీ చేసింది. ఉదయం మాత్రమే తరగతులు నిర్వహించాలని సూచించింది.