13-08-2025 12:06:15 AM
హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి మం త్రి బండి సంజయ్‌కు మంగళవారం లీగల్ నోటీసు పంపారు. ఫోన్ ట్యాపింగ్‌కు సం బంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారమైనవని పేర్కొన్నారు. ఈనెల 8న బండి సంజయ్ నిర్వ హించిన ప్రెస్‌మీట్‌లో చేసిన ఆరోపణలపై కేటీఆర్ ఈ నోటీసును పంపించారు.
బండి సంజయ్ తన ప్రతిష్ఠను దిగజార్చడానికి ప్ర యత్నిస్తున్నారని నోటీసులో ఆరోపించారు. కేవలం రాజకీయంగా వార్తల్లో నిలిచేందుకే బండి పదేపదే వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణల వల్ల కేటీఆర్ ప్రతిష్ఠకు భంగం కలిగిందని, తెలంగాణ ఏర్పాటుతో పాటు ఆ తర్వాత మంత్రిగా కేటీఆర్ అనేక రంగాల్లో అద్భుతమైన సేవలు అందించారని, అయితే బండి సంజ య్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలతో తమ క్లుంట్ కేటీఆర్ పరువుకి భంగం కలుగుతుందని న్యాయవాదులు నోటీసులో పేర్కొన్నారు.
మీడియా సమావేశంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి సాక్షాధారాలు లేవని, ఒక పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్రమంత్రి బాధ్యతల్లో ఉండి అసత్య వ్యాఖ్యలు చేయడం సరికాదని కేటీఆర్ తరఫు న్యాయవాదులు అన్నారు. కేటీఆర్‌కు బండి సంజ య్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని.. కేటీఆర్, అతడి కుటుంబ సభ్యులపై భవిష్య త్తులో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయకూడదని నోటీసులో డిమాండ్ చేశారు. నోటీసు అందిన ఏడు రోజుల్లో డిమాండ్లను పాటించని పక్షంలో, చట్టపరంగా సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.