calender_icon.png 13 August, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

11-08-2025 12:47:04 AM

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశీర్వదించండి

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు

 పెద్దపల్లి, ఆగస్టు 10(విజయ క్రాంతి); మహిళలను కోటిశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే  చింతకుంట విజయ రమణారావు  అన్నారు.ఆదివారం మండలంలోని అప్పన్నపేట, బొంపల్లి, మేరపల్లి గ్రామాల్లో ఆదివారం రూ.1 కోటి 10 లక్షల నిధులతో చేపట్టిన రోడ్లు, డ్రైనేజీలు, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,  ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మహిళా సంఘ భవనం, అప్పన్నపేటలో కామన్ సర్వీస్ సెంటర్  ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసి, ఇళ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే ముగ్గులు పోశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, కొత్తగా రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రైతులకు రూ. రెండు లక్షల రుణమాఫీ, రూ.5వందలకే గ్యాస్ సిలిండర్,  రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సదుపాయానికి రూ. 10 లక్షల పెంపు, కటింగులు లేకుండా వడ్ల కొనుగోలు, సన్న వడ్లకు రూ. 500 బోనస్, ఇసుక సులభతరం వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముంగిటకు తీసుకు వచ్చినట్టు చెప్పారు.

ప్రతి కుటుంబానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, మరోవైపు గ్రామ గ్రామాన ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు చెప్పారు. తమ సేవలను గుర్తించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను, కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అరె సంతోష్, సందవేణి రాజేందర్, చింతపండు సంపత్, కాలబోయిన మహేందర్, నుగుల్లా మల్లయ్య, ఏడ్లి శెంకర్, బొంకురి అవినాష్, ముత్యాల నరేష్,జెడల రాజు,వేరేశం, రాజు,శ్రీనివాస్,శ్రీకాంత్ శ్రీనివాస్, నరేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.