13-08-2025 12:25:54 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 12: ఆధార్ కార్డును ప్రభుత్వ, ప్రైవేటు సేవలు పొందేందుకు వినియోగించుకోవచ్చని, కానీ.. దానిని పౌరస త్వానికి రుజువుగా పరిగణించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఓటరు జాబితా సవరణలో భాగంగా, ఆధార్ వివరాలను తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని ఎన్నికల సం ఘం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు సమర్థిస్తూ ఈ తీర్పు వెలువరించింది. బీహార్‌లో స్పెష ల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై దాఖలైన పిటిషన్లపై మంగళవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఆధార్ కార్డు, రేషన్‌కార్డు, ఎలక్ట్రోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డులను పౌరసత్వానికి రుజువులు కావని తేల్చిచెప్పింది. ఆధార్ కార్డును పౌరసత్వానికి తిరుగులేని రుజువుగా అంగీకరించలేమని ఈసీ చెప్పడం సరైనదే’ అని ధర్మాసనం పేర్కొన్నది. పిటిషనర్ల తరఫు నది కపిల్ సిబల్ వాదనలను వినిపిస్తూ.. ‘ఈసీ చేపట్టిన ప్రక్రియలో ఎన్నో అసమానతలు ఉన్నా యి. ఈ ప్రక్రియ ఎంతోమంది ఓటర్లను మారుస్తుంది.
1950 తర్వాత పుట్టిన వారందరినీ భారత పౌరులుగా గుర్తించాలి. ఈసీ ఒక నియోజకవర్గంలో 12 మంది చనిపోయినట్లు ఈసీ పేర్కొన్నది. కానీ, వారు సజీవంగానే ఉన్నారు. మరో సందర్భంలో బతికే ఉన్న వ్యక్తులను చనిపోయినట్లు ప్రకటించారు’ అని ధర్మాసనానికి తెలిపారు. ఈసీ తరఫు న్యాయవాది రాకేశ్ ద్వివేది తన వాదనలు వినిపిస్తూ.. ‘చనిపోయిన వారిని బతికి ఉన్నట్లుగా, సజీవంగా ఉన్నవారిని చనిపోయినట్లుగా ప్రకటించడం వంటి తప్పిదాలను సరిదిద్దవచ్చు.
ఈసీ ప్రకటించింది.. కేవలం ముసాయిదా మాత్రమే. ఎలక్ట్రోరల్ రివిజన్ రాజ్యాంగబద్ధమైనది. ఆధార్, రేషన్ కార్డులు పౌరుల పౌరసత్వాన్ని తెలిపేవి కావు’ అని వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం స్పందిస్తూ.. ఓటర్ల జాబితాకు సంబంధించిన వాస్తవాలు, గ ణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఈసీని ఆదేశించింది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవ రణకు ముందు ఎంత మంది ఓటర్లు ఉన్నా రు.. గతంలో నమోదైన మరణాల సంఖ్య.. ఇప్పుడు నమోదు చేసిన మరణాల సంఖ్య వంటి గణాంకాలు ఈసీ వద్ద ఉండాలని, వాటిపైనే మున్ముందు ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నది.