28-12-2025 01:33:19 AM
కాంగ్రెస్ శ్రేణులకు పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ పిలుపు
హైదరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి.. మహాత్మగాంధీ పేరు తొలగించినందుకు ఆదివారం గ్రామాల్లో చేపట్టే నిరసనలను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఎన్నో ఉద్యమాల ఫలితంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే.. బీజేపీ ప్రభుత్వం పేదలకు పని దొరకకుండా కుట్ర చేస్తోందని శనివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేదలకు, గ్రామీణ ప్రాంత కూలీలకు ఎంతో భరోసాగా ఉన్న పథకాన్ని నీరు గార్చాలనే కుట్ర చేస్తోందని మండిపడ్డారు.