calender_icon.png 28 December, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుబాయ్ సమ్మిట్‌కు కేటీఆర్‌కు ఆహ్వానం

28-12-2025 01:34:59 AM

జనవరి 9 నుంచి జునికార్న్ అండ్ గ్లోబల్ ఇన్నోవేషన్

హైదరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): వచ్చే ఏడాది జనవరి 9 నుంచి 11వ తేదీ వరకు దుబాయ్‌లో జరిగే 2వ అంతర్జాతీయ జునికార్న్ అండ్ గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్‌లో పాల్గొనాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు. ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ ఈ సదస్సును నిర్వహిస్తోంది. వందకు పైగా అంతర్జాతీయ కంపెనీల సీఈవోలు, వెంచర్ క్యాపిటలిస్టులు, పెట్టుబడిదారులు, యువ ఆవిష్కర్తలు ఇందులో పాల్గొననున్నారు. ఈ సమ్మిట్‌కు గౌరవ అతిథిగా పాల్గొనాలని కేటీఆర్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు.