09-11-2024 12:22:57 PM
సదర్ ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించుటలో మంత్రి శ్రీధర్ బాబు చేసిన కృషికి ధన్యవాదాలు
ముత్తారం యాదవ్ సంఘం మండల అధ్యక్షులు కాసు తిరుపతి యాదవ్
పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా వద్ద ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించబోయే సదర్ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని ముత్తారం యాదవ్ సంఘం మండల అధ్యక్షులు కాసు తిరుపతి యాదవ్ కరపత్రాలు విడుదలలో అన్నారు. ఈ సందర్భంగా యూత్ మండల అధ్యక్షుడు చెలుకల యూగేందర్ తో కలిసి మాట్లాడుతూ.. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదవులు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే సదర్ పండుగను రాష్ట్ర అధికారిక పండుగగా గుర్తించడం హర్షనీయమన్నారు. సదర్ పండుగను రాష్ట్ర అధికారిక పండుగగా గుర్తించడంలో ప్రముఖంగా కృషి చేసిన మంథని అభివృద్ధి ప్రధాత, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు కు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
యాదవుల గొప్పతనాన్ని, వ్యక్తిత్వాన్ని, సంస్కృతిని ప్రతిబింబించే సదర్ ఉత్సవాలకు మండల వ్యాప్తంగా యాదవ సోదరులందరూ పెద్ద ఎత్తున తరలివెళ్లి సదర్ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు బక్కతట్ల కుమార్ యాదవ్, ముత్తారం మండల ప్రధాన కార్యదర్శులు సింగనవేన సదయ్య యాదవ్, ఏడు మేకల కిరణ్ యాదవ్, అఖిలభారత యాదవ మహాసభ ముత్తారం మండల మాజీ మండల అధ్యక్షులు మారేడుగొండ రాజయ్య యాదవ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బక్కతట్ల వినీత్ యాదవ్, మండల యాదవ నాయకులు దుండ్ర రవికుమార్ యాదవ్, పెద్దమ్మల గట్టయ్య యాదవ్, బైరి రాజు యాదవ్, సింగనవేన సమ్మయ్య యాదవ్, రాజశేఖర్ యాదవ్, తాత తిరుపతి యాదవ్, పోసాని పాపయ్య యాదవ్, నెత్తెట్ల నరేష్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్ తదితర యాదవ కులస్తులు పాల్గొన్నారు.