8 July, 2026 | 8:03 PM

Breaking News

నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •  

25 ఏళ్ల తర్వాత మక్తల్‌కు మంత్రి పదవి

09-06-2025 02:29 AM
  1. జై మక్తల్ ట్రస్ట్ తరఫున వాకిటి శ్రీహరికి ప్రత్యేక శుభాకాంక్షలు
  2. ట్రస్ట్ చైర్మన్ సందీప్‌కుమార్ మక్తల హర్షం

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): దాదాపు 25ఏళ్ల తర్వాత మ క్తల్ నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కిందని జై మక్తల్ ట్రస్ట్ చైర్మన్ సందీప్‌కుమార్ మక్తల ఆదివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశా రు. ముదిరాజ్ కోటాలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాకిటి శ్రీహరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో నియోజకవర్గ ప్రజలు సం తోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా జై మక్తల్ ట్రస్ట్ తరఫున మంత్రి శ్రీహరికి ప్రత్యేక శుభా కాంక్షలు తెలియజేశారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని రాజకీ య ప్రస్థానం సాగించిన వాకిటి శ్రీ హరి సర్పంచ్ నుంచి జడ్పీటీసీ, జడ్పీ ఫ్లోర్‌లీడర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి, ఎమ్మెల్యే, తాజాగా మంత్రి ప దవి చేపట్టారని వివరించారు.

ఇక మక్తల్ నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని ధీమా వ్య క్తం చేశారు. రాజకీయాలకు అతీతం గా నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరూ మంత్రి శ్రీహరికి సహకరించాలని కోరారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి మంత్రి ఇచ్చినందుకు కాంగ్రెస్ అధిష్ఠానానికి, ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.